IOCLలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే..!
ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీకోసం. కేవలం అప్లై చేసుకునే ఈ జాబ్ ను పొందవచ్చు. మరికెందుకు ఆలస్యం ఆ వివరాలు ఇక్కడ చూడండి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థలో ట్రేడ్,టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్.. తదితర ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13లోపు అప్లై చేసుకునే వీలుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 456 టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కేటగిరీలు కలిపి ఈ ఖాళీలు దిల్లీ, హరియాణా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్,రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
అర్హత: ట్రేడ్ అప్రెంటిస్ కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగానికి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లోమా పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగం కోసం డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉంది. కనీసం 50శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. జనవరి 31, 2025నాటికి ఈ వయసు మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ బేసిస్ విధానంలో ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు 12 నెలలపాటు అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి: అర్హులైన అభ్యర్థులు NAPS/NATS పోర్టల్ ద్వారా లాగిన్ అయి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి..
టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్
ఐటీఐ, డిప్లోమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
నివాస పత్రం
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
పాన్, ఆధార్ కార్డు
పాస్ ఫొటో
సిగ్నేచర్












Click it and Unblock the Notifications