IPPB 2024 : డిగ్రీ అర్హ‌త‌తో.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 47 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో కాంట్రాక్ ప్రాతిప‌దికన ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆన్లైన్ విధానంలో మాత్ర‌మే అప్ల‌య్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్స్‌, ఇంట‌ర్య్వూ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ఎంపిక అభ్య‌ర్థుల‌కు నెల‌కు 30వేల రూపాయ‌ల వేత‌నం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకునేందుకు ఏప్రిల్ 5, 2024 చివ‌రితేదిగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల కోసం https://www.ippbonline.com/ ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

IPPB 2024 With Degree as Eligibility Jobs in India Post Payments Bank

ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం : 47
విద్యార్హ‌త : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఆన్‌లైన్‌లో మాత్ర‌మే
ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతన వివ‌రాలు : ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30వేల రూపాయ‌ల వరకు వేత‌నం వ‌స్తుంది.
ఉద్యోగాల‌కు ఎంపిక చేయు విధానం : ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.
దరఖాస్తు ఫీజు : ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.750 ఫీజుగా నిర్ణ‌యించారు. ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం 150 రూపాయ‌లు ఫీజుగా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థుల‌కు ఏప్రిల్‌ 5, 2024 చివ‌రితేదిగా నిర్ణ‌యించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+