IRCTC Jobs : రాత పరీక్ష లేదు.. నెలకు ₹67,000 జీతం !

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? పరీక్షలు రాయకుండానే మంచి జీతం సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మీకు గొప్ప అవకాశం కల్పిస్తోంది! ఐఆర్‌సీటీసీ 2025 సంవత్సరానికి గాను వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ. 67,000 వరకు జీతం అందుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 25. ఈ ఉద్యోగాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ అంటే ఏమిటి?
ఐఆర్‌సీటీసీ భారత ప్రభుత్వానికి చెందిన ఒక మినీరత్న కంపెనీ. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైల్వే ప్రయాణికులకు క్యాటరింగ్, టూరిజం, ఆన్‌లైన్ టికెటింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పర్యాటక ,హాస్పిటాలిటీ సంస్థలలో ఒకటి. ఐఆర్‌సీటీసీలో ఉద్యోగం చేయడం అంటే ప్రభుత్వ రంగంలో స్థిరమైన భవిష్యత్తును కలిగి ఉండటమే కాదు, దేశానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుంది.

irctc-recruitment-2025-govt-jobs-without-exam-and-salary-up-to-67-000

ఉద్యోగ వివరాలు:
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ), మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు వేతనం నెలకు రూ. 37,400 నుండి రూ. 67,000 వరకు (అనుభవాన్ని బట్టి) ఉంటుంది. వయో పరిమితి 55 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంది. చాలామందికి ఇది అనుకూలమైన వయోపరిమితి.
దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 25, 2025. ఈ గడువు తేదీని గుర్తుంచుకోని ఆలస్యం చేయకుండా ధరఖాస్తు చేసుకోంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే. ఆన్‌లైన్ గందరగోళం లేదు, సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం, ఎవరు అర్హులు?
మీరు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేట్), బి.ఎస్సీ, బి.టెక్ లేదా బి.ఇ పట్టా పొందినట్లయితే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు అర్హులు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే - రాత పరీక్ష లేదు! మీ ఎంపిక కేవలం షార్ట్‌లిస్టింగ్ (మెరిట్ ఆధారంగా), ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. మీ ప్రతిభకు, అర్హతలకు ఇక్కడ నిజమైన గుర్తింపు లభిస్తుంది. రాత పరీక్షల భయం లేకుండా, మీ సామర్థ్యంతో ఉద్యోగం సాధించే అవకాశం ఇది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ఐఆర్‌సీటీసీ అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఫారమ్‌ను పూర్తిగా నింపండి. అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జత చేయండి. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు గడువు తేదీలోగా పంపించండి. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే, అన్ని పత్రాలు పూర్తి చేసి, సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి. ముఖ్యంగా చివరి తేదీ లోపు పంపించడం మర్చిపోవద్దు..చివరి నిమిషంలో వెబ్‌సైట్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+