Influencers: ఇదెక్కడి కాలేజ్ రా మావా.. ఈ డిగ్రీ కోర్సు చేస్తే డబ్బులే డబ్బులు..!!
Ireland new career path: 2000 సంవత్సరం తర్వాత పుట్టిన నేటి తరం యువత తమకు ఇష్టమైన పనిచేస్తూనే లక్షల్లో సంపాదిస్తున్నారు. దీనికి పెద్దపెద్ద డిగ్రీలు కూడా అక్కర్లేదు. ఎంబీఏలు, ఎంబీబీఎస్ లాంటి పెద్ద చదువులతో కొలువులు చేస్తున్న వారి కంటే ఎక్కువగానే నేటి తరం కంటెంట్ క్రియేటర్లు సంపాదిస్తున్నారు. కుక్కును కొడితే డబ్బులు రాలతాయ్ అనే సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం ప్రస్తుత కాలంలో డిజిటల్ యూజర్లు పెరగటంతో కంటెంట్ క్రియేటర్లపై ధనలక్ష్మి కటాక్షం కూడా ఇదే మాదిరిగా ఉంది. వాస్తవానికి "ఇన్‌ఫ్లుయెన్సర్" అనే పదం అధికారికంగా 2019లో డిక్షనరీకి జోడించబడింది.
ప్రస్తుతం ఐర్లాండ్ దేశంలో కొత్త కెరీర్ మార్గం Gen-Zని ఆకర్షిస్తోంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫాలోయింగ్‌ను పెంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చాలా మంది యువత భావిస్తున్నారు. వర్క్ ప్రెజర్, తలనొప్పితో కూడిన కార్పొరేట్ జాబ్స్ కాకుండా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా మారాలని 1997-2012 మధ్య జన్మించిన యువత భావిస్తున్నారు. ఒక సర్వే తేలిన వివరాల ప్రకారం ఈ మధ్య వయస్కులు యూట్యూబర్ లేదా ప్రొఫెషనల్ స్ట్రీమర్‌గా ఉద్యోగాన్ని పరిగణిస్తారని వెల్లడైంది.

ఇలాంటి సమయంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లకు సహాయం చేయటానికి.. ఐర్లాండ్ కార్లోలోని సౌత్ ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్శిటీ తొలిసారిగా ప్రత్యేక కోర్సును ప్రారంభించింది. ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు "కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా"లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని అందిస్తోంది. ఈ కోర్సు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉన్న వివిధ ఆదాయ మార్గాలను ఎలా మార్చుకోవాలో నేర్పుతుంది. ఇప్పటికే దీనికి దాదాపు 350 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కోర్సు డైరెక్టర్ ఐరీన్ మెక్‌కార్మిక్ వివరించారు.
ఈ సంవత్సరం అధికారికంగా గుర్తింపు పొందిన డిగ్రీ గత నెలలో 15 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్‌ని ప్రారంభించింది. కెమెరా ముందు లేదా తెరవెనుక ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రతిభకు ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయని మెక్‌కార్మిక్ చెప్పారు. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌లు కొన్నిసార్లు పనికిమాలినవి కావచ్చు, కానీ అసలు వ్యాపారం కాదు, ఇది చాలా తీవ్రమైన వ్యాపారమని కార్మిక్ పేర్కొన్నారు. ఇప్పటికే చేరిన విద్యార్థులు డిజిటల్ స్పేస్ లో సుపరిచితులే అయినప్పటికీ.. టార్గెట్ ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వటానికి అవసరమైన స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటారని ఆమె వెల్లడించారు. ఈ డిగ్రీ మాడ్యూల్స్‌లో సృజనాత్మక వీడియో అండ్ స్టోరీ టెల్లింగ్ సైకాలజీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్, సెలబ్రిటీ స్టడీస్, స్టోరీ టెల్లింగ్ సైకాలజీ, డేటా అనలిటిక్స్, పోడ్‌కాస్టింగ్ ఉన్నాయి. ఈ ఇన్‌ఫ్లుయన్సర్లు బ్రాండ్ డీల్స్ వంటి ప్రమోషన్లతో అధికంగా సంపాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications