JNTU JOB FAIR 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు JNTU హైదరాబాద్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1న జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వాల్ పోస్టర్ ను విడుదల చేసింది. టెన్త్ క్లాస్ నుంచి పట్టభద్రుల వరకు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ ను ఒక్క చోటకు తీసుకురానున్నారు. జేఎన్‌టీయూలో జరిగే మెగా జాబ్ ఫెయిర్ -2025 లో వందకు పైగా కంపెనీలు హాజరుకానున్నాయి.. దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాల ఆఫర్స్‌తో కంపెనీలు రిక్రూట్‌మెంట్ జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిపుణా & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో ఈ మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.

ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి వాల్ పోస్టర్ ను విడుదల చేసిన వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి.. ఈ జాబ్ ఫెయిర్ విద్యార్థులు, ఉద్యోగార్థులకు.. ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్‌మెంట్ రంగాల్లో విశేష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Jawaharlal Nehru Technological University to Host Mega Job Fair on March 1 with 20 000 Offers
జేఎన్‌టీయూ మెగా జాబ్ ఫెయిర్‌లో దాదాపు 20 కు పైగా ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా కంపెనీలు, 30 కోర్ కంపెనీలు, 40 కు పైగా బ్యాంక్, రిటైల్, FMCG, మేనేజ్ మెంట్ సంస్థలు పాల్గొంటున్నాయి. మార్చి 1న కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఉదయం 10 గంటల నుంచి జాబ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఫోటోలోని క్యూఆర్ కోడ్ ద్వారా ఉద్యోగార్థులు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+