నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల..!
నేడు (ఆదివారం) జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. గత నెల 26 వ తేదిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ' ఈ నెల 2న విడుదలయ్యింది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇప్పడు తాజాగా జూన్ 9న అంటే నేడు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. దేశంలోని ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. నేటి ఉదయం పది గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఈ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్‌తో పాటు తుది కీలను కూడా నేడు విడుదల చేయనున్నారు.
ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 1.91 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను గత నెల 31న ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది.

ఈ పరీక్షకు సంబంధించిన పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలు ఇప్పటికే అధికారికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లు కలిపి మొత్తం 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరవగా, వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications