జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ రిలీజ్.. ఎప్పుడంటే?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పారీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in చూడవచ్చు. కాగా సెషన్ 1 2026 జనవరి 21 నుంచి జనవరి 30 వరకు.. సెషన్ 2 ను ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో రెండు షిఫ్టులలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం షిఫ్ట్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
దరఖాస్తు ప్రక్రియ..
సెషన్ 1 కోసం దరఖాస్తులు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి. సెషన్ 2 కోసం దరఖాస్తులు జనవరి 2026 చివరి వారంలో స్వీకరించబడతాయి. NTA ఈసారి పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను పెంచే ఏర్పాట్లను ప్రకటించింది. అలాగే, దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

దరఖాస్తు సమయంలో, ఆధార్ కార్డు లేదా 10వ తరగతి సర్టిఫికెట్‌లో పేర్లలో వ్యత్యాసం ఉన్న అభ్యర్థులు సరిదిద్దుకునే అవకాశం పొందుతారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్ సందర్శించి, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, ఖాతా సృష్టించాలి. తరువాత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి, పరీక్ష రుసుము చెల్లించి, సమర్పించిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకూడదు.
పరీక్షా ఫార్మాట్..
జేఈఈ మెయిన్ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది.
పేపర్లు..
పేపర్ 1: NIT, IIIT, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే BE/B.Tech ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించబడింది. ఇది IITలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్కు అర్హతగా ఉంటుంది.
పేపర్ 2: B.Arch, B.Planning కోర్సుల కోసం నిర్వహించబడుతుంది. దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.
పరీక్ష ఆన్‌లైన్ (CBT) ఫార్మాట్‌లో ఉంటుంది. పేపర్ 1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ క్వశ్చన్‌లు ఉంటాయి, పేపర్ 2లో ఆర్కిటెక్చర్/ప్లానింగ్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్య సూచనలు..
NTA ఈసారి పరీక్షలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక, సేఫ్టీ ఏర్పాట్లను చేస్తోంది. అభ్యర్థులు ఫోన్, క్యాల్క్యులేటర్, ఇతర నిషిద్ధ వస్తువులను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదు. ప్రతి అభ్యర్థి ఫేస్ మాస్క్ ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరి. అభ్యర్థులు పూర్తి రీజనల్ మరియు గ్లోబల్ COVID-19 మార్గదర్శకాలను అనుసరించడం అవసరం. అదనంగా, NTA లో అభ్యర్థుల సమస్యలకు హెల్ప్‌డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు విధానం..
- అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేసి హోమ్‌పేజీలో కనిపించే 'జేఈఈ మెయిన్-2026' లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
- మీరు క్రియేట్ చేసిన ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, పరీక్ష రుసుము చెల్లించాలి.
- 'సబ్మిట్' పై క్లిక్ చేసి, సమర్పించిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోవాలి.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications