JEE Mains: ఇవి ఉంటే నో ఎంట్రీ.. ఈ చెక్ లిస్ట్ చూసుకోండి

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (సెషన్-2) (JEE Main 2026 Session 2) పరీక్షలకు రంగం సిద్ధమైంది. రేపు, అంటే ఏప్రిల్ 2 (గురువారం) నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే కాకుండా, విద్యార్థుల కోసం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్క చిన్న పొరపాటు చేసినా పరీక్షకు అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డును కచ్చితంగా తీసుకెళ్లాలి. దానితో పాటు ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా నింపాలి. అడ్మిట్ కార్డులో మీ ఫోటోను అతికించి, ఎడమచేతి బొటనవేలు ముద్ర వేయాలి. అయితే, సంతకం మాత్రం పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ ముందే చేయాల్సి ఉంటుంది. ఆధార్ లేని వారు అడ్మిట్ కార్డులోని 4వ పేజీలో ఉన్న 'నాన్-ఆధార్ డిక్లరేషన్' ఫారం నింపడం మర్చిపోవద్దు.

JEE Main 2026 Session 2 Starts Tomorrow NTA Exam Day Guidelines Admit Card and Reporting Time Details

గుర్తింపు కార్డు విషయంలో జాగ్రత్త..

ఫోటోతో కూడిన ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరి. అలాగే, దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్లాలి. వీటిని అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్టీఏ నుంచి ఈమెయిల్ పొంది ఉంటే, ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను కూడా వెంట ఉంచుకోవాలి.

సమయం చాలా ముఖ్యం!

పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.

  • ఉదయం షిఫ్ట్: ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలి. 9 గంటలకు పరీక్ష మొదలై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది.
  • మధ్యాహ్నం షిఫ్ట్: మధ్యాహ్నం 1 గంటకే రిపోర్ట్ చేయాలి. 3 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

గేటు మూసివేసే సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గంట ముందే చేరుకోవడం ఉత్తమం.

వీటికి నో ఎంట్రీ..

పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులను అసలు అనుమతించరు. పెన్సిల్ బాక్సులు, పేపర్లు కూడా నిషిద్ధం. కేవలం ట్రాన్స్‌పరెంట్ (పారదర్శకమైన) వాటర్ బాటిల్, బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకెళ్లాలి. మధుమేహం ఉన్న విద్యార్థులు పండ్లు, టాబ్లెట్స్ తీసుకెళ్లవచ్చు కానీ, చాక్లెట్లు, శాండ్‌విచ్‌లు వంటి ప్యాక్డ్ ఫుడ్‌కి అనుమతి లేదు.

పరీక్షా హాలులో..

కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత మీకు కేటాయించిన సబ్జెక్టు పేపరే వచ్చిందో లేదో సరిచూసుకోండి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లండి. రఫ్ వర్క్ కోసం అక్కడ ఇచ్చే షీట్లను మాత్రమే వాడాలి, పరీక్ష ముగిశాక వాటిని అక్కడే అప్పగించాలి.

మీకు ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000 నంబర్‌కు లేదా [email protected] మెయిల్ ఐడీ ద్వారా ఎన్టీఏని సంప్రదించవచ్చు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+