JEE Main Result 2024 : ఈ నెల 12న జేఈఈ మెయిన్ సెషన్-1 రిజల్ట్...
ఈ నెల 12న అంటే రేపు జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే జేఈఈ సెషన్ -1 తుది కీ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక, రేపు జెఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షలు జరిగాయి. ఇక, జేఈఈ సెషన్-1 ఆన్సర్ కీని జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఇప్పటికే విడుదల చేసిన విషయం విదితమే.
జేఈఈ మెయిన్ సెషన్ -2 పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఈ రెండు విడతలకు కలిపి గతంలో అప్లయ్ చేసినవారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. ఇక, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ పరీక్షకు అప్లయ్ చేసుకోవచ్చు.

సెషన్ 2 పరీక్షలు పూర్తయ్యాక రెండింటిలో వచ్చిన మార్స్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకును కేటాయించడం జరుగుతుంది. సెషన్ 1 పేపర్‌కు 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెషన్ 1 పేపర్ పరీక్షకు మొత్తం 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే 95.8 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎన్‌టీఏ ప్రకటిచింది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ వంటి సీట్ల భర్తీకి జనవరి 24 వ తేదీన నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు అప్లయ్ చేసుకోవడం జరిగింది.
అందులో 55,493 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది హాజరయ్యారు. ఇక వీటి ఫలితాలు విడుదలయ్యాకు అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోగలరు. జేఈఈ మెయిన్ సెషన్-1కు ఈ సారి విదేశాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications