ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల...!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ సెషన్ 2 ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. వీటి ఫలితాలు ఏప్రిల్ 25వ తేదీన విడుదలకానున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ తెలిపింది. ఇటీవలే జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదలయ్యింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ పరీక్షల ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీలు, సీఎఫ్‌టీఐలలో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. అందుకోసం ఎన్‌టిఎ ప్రతి సంవత్సరం రెండుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి సెషన్ పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. రెండవ సెషన్‌కు సంబంధించిన పరీక్షలు కూడా ముగిశాయి. ఇక, వీటి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.ఈ నెల 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 319 సిటీల్లో జేఈఈ మెయిన్ 2 పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్ పరీక్ష మొత్తం 13 భాషల్లో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళంకన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

మెయిన్‌లో అర్హత సాధిస్తేనే అడ్వాన్స్‌డ్...
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' ఎన్‌టిఎ తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది. ఈ ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లనూ కూడా ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీల్లో చేరాలనుకునేవారు తప్పకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాల్సిందే. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత వహిస్తారు.












Click it and Unblock the Notifications