ALERT:రేపటి నుంచే ఐఐటీ జేఈఈ మెయిన్.. ఆ బట్టలు వేసుకుంటే నో ఎంట్రీ

విద్యార్థులకు అలర్ట్. ఐఐటీ జేఈఈ మెయిన్​​ పరీక్షలు దేశవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 2, 3, 4, 7, 8 తేదీల్లో రోజుకు రెండు షిఫ్ట్‌లలో ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ లోకి ప్రవేశానికి పేపర్​-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇక బీఆర్క్, బీ ప్లానింగ్ ప్రవేశాలకు​ పేపర్​-2ను ఏప్రిల్ 9వ తేదీన ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తారు.

ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షకు తొలి విడత పేపర్​-1 పరీక్షలకు మొత్తం 13.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12.58 లక్షలు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా. తొలి విడతలో భాగంగా తెలిపిన ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే100 పర్సంటైల్​ స్కోర్​ ను సాధించారు.

తుది విడతపరీక్షలు ముగిసిన తర్వాత ఎన్​టీఏ ఏప్రిల్​ 17న లేదా అంతకు ముందే అఖిల భారత ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఎన్​ఐటీలు, ఐఐఐటీల్లో బీటెక్​ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఒకవేళ ఐఐటీల్లో చేరాలనుకుంటే మాత్రం మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష​ రాయాల్సి ఉంటుంది.

JEE Mains Kicks Off Tomorrow Follow These Rules for Entry

ఈ రూల్స్ తెలుసా..?

పరీక్షా కేంద్రం గేట్లను ఉదయం 8.30, అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు మూసేస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఇక మొదటి షిప్ట్​ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో షిప్ట్​ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో మొబైల్స్​, ఇతర ఎలక్ట్రానిక్​ వస్తువులను అనుమతించరు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. రెండు పాస్ ఫొటోలు,​ పెన్ను, అడ్మిట్​ కార్డు తీసుకెళ్లాలి.

బీఆర్క్​ పరీక్షకు పెన్సిల్​, స్కేల్​, రబ్బరు, జామెంట్రీ బాక్స్​ కూడా తీసుకెళ్లాలి. మఫ్లర్లు, షాల్స్​, టోపీలు, రంగుల కళ్లద్దాలు, స్కార్ప్​లు, స్టోల్స్​ వంటివి ధరిస్తే లోపలికి ఎంట్రీ లేదు. అభ్యర్థులు పాకెట్​లు లేని దుస్తులను వేసుకొని వెళ్లాలి. వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి. దుస్తులపై మెటాలిక్స్​, అలంకారాలు ఉంటే సెంటర్​లోకి అనుమతి లేదు. పరీక్ష కేంద్రంలోకి బూట్లు, బరువున్న చెప్పులు వేసుకోకూడదు. ఉంగరాలు, గాజులు, ఆభరణాలు, నగలు వేసుకోవద్దని రూల్స్ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+