vaastu tips: వాస్తు ప్రకారం ఇనుప వస్తువులు ఇంట్లో ఎక్కడ ఉంచాలి?

vaastu tips: ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారం చేసేవారు తరచూ తమ షాపులోని స్టాక్‌ను లేదా బరువైన ఇనుప సామగ్రిని తాత్కాలికంగా ఇళ్లలోనే భద్రపరుస్తుంటారు. అయితే, వ్యాపార సౌకర్యం కోసం చేసే ఈ పని వాస్తు పరంగా తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బరువైన ఇనుప వస్తువులను ఎక్కడపడితే అక్కడ ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించడమే కాకుండా, అనేక ఆర్థిక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వాస్తు నియమాల ప్రకారం బరువైన ఇనుప సామాన్లు లేదా స్టాక్‌ను భద్రపరచడానికి దక్షిణం, పడమర దిక్కులు అత్యంత అనుకూలమైనవి. ముఖ్యంగా నైరుతి మూలతో పాటు దక్షిణం, పడమర భాగాల్లో బరువులు ఉంచడం వల్ల ఇంటికి స్థిరత్వం లభించడమే కాక సానుకూల శక్తి పెరుగుతుంది.

vaastu tips: అటాచ్డ్ బాత్‌రూం, వాటర్ సంప్ కు సంబంధించి వాస్తు నియమాలు
vaastu tips: అటాచ్డ్ బాత్‌రూం, వాటర్ సంప్ కు సంబంధించి వాస్తు నియమాలు

ఉత్తరం, ఈశాన్యం దిక్కుల్లో వద్దు
అదే సమయంలో, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల్లో బరువైన వస్తువులను ఉంచడం పెద్ద పొరపాటు. ఈశాన్యాన్ని ఈశ్వర స్థానంగా, లక్ష్మీదేవి సంచరించే ప్రదేశంగా భావిస్తారు. అలాగే ఉత్తర దిక్కు ధనాధిపతి అయిన కుబేరుడి స్థానం. ఈ దిక్కుల్లో బరువైన ఇనుప సామాగ్రిని పెట్టడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల వ్యాపారంలో రాబడి తగ్గిపోవడం, ఊహించని ఖర్చులు పెరగడం, చేతిలో రూపాయి నిలవకపోవడం వంటి తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. అంతేకాకుండా, కుటుంబ సభ్యులలో మానసిక ప్రశాంతత లోపించి, నిరంతరం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వెంటాడతాయి.

Vaastu tips According to Vaastu where should iron objects be placed in the house Full Details Here
vaastu tips: పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతుంటే ఇలా చేయండి!
vaastu tips: పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతుంటే ఇలా చేయండి!

శనిదేవుడి ధాతువు ఇనుము
జ్యోతిష్య పరంగా కూడా ఇనుమును శని దేవుని ధాతువుగా పరిగణిస్తారు. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, లేదా ఇనుప వస్తువులకు తుప్పు పట్టి మూలన పడి ఉన్నా శని దోషం పెరిగి దరిద్రం ఆవహిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఐరన్ వ్యాపారులు ఇంట్లో భద్రపరిచే వస్తువులను కేవలం దక్షిణం, పడమర భాగాలకే పరిమితం చేయాలి. ఉత్తర, ఈశాన్య మూలలను ఎప్పుడూ ఖాళీగా, తేలికగా, శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో సఫలతతో పాటు ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+