Govt Jobs : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వేతనం రూ. 90 వేలు వరకు..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తూర్పు ప్రాంతానికి సంబంధించి 89 జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు www.aai.aero అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్ట్ అయిన అభ్యర్థులు రూ.31 వేల నుంచి రూ. 92 వేల వరకు వేతనం పొందుతారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జనవరి 28, 2025 గా పేర్కొంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పోస్టుల సంఖ్య మారవచ్చు.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 89 పోస్టులు

విద్యార్హత:
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది).
వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 డిసెంబర్ 2024
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28 జనవరి 2025
పరీక్ష తేదిని తర్వాత అధికారిక వెబ్ సెట్‌లో పేర్కొంటారు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది.
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET): శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు మరియు ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తారు.
మెడికల్ పరీక్ష: వైద్య పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
AAI అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
సాధారణ/OBC/EWS: ₹1,000/-
మహిళా/SC/ST/ఎక్స్-సర్వీస్ మెన్: ఫీజు లేదు
పరీక్ష సిలబస్:
CBT పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్ మరియు ఫైర్ సర్వీసెస్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
ముఖ్యమైన విషయాలు:
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయండి. పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం AAI అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ని సందర్శించండి












Click it and Unblock the Notifications