Jobs : పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు...
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదోతరగతి అర్హతతోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 పోస్టులతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 484 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల, అర్హత వివరాలు చూద్దాం..
మొత్తం పోస్టులు: 484
జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే..
అహ్మదాబాద్- 76,
భోపాల్- 38,
దిల్లీ- 76,
కోల్‌కతా- 2,
లఖ్‌నవూ- 78,
ఎంఎంజడ్‌వో & పుణె- 118,
పాట్నా- 96 పోస్టులున్నాయి.

విద్యార్హత : ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు : నెలకు రూ.14,500- రూ.28,145 ఉంటుంది.
పరీక్ష వివరాలు :
ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 70 మార్కులకు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 30 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షల అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్షలో ఉండే సబ్జెక్టులు :
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) వంటి అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
అప్లయ్ చేసుకునేందుకు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 ఫీజును వసూలు చేయనున్నారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: డిసెంబర్ 20, 2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 09, 2024
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి 2024.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జనవరి 2024.
ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఆన్‌లైన్ పరీక్ష: ఫిబ్రవరి 2024.
పరీక్ష ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2024.
పూర్తి వివరాల కోసం https://centralbankofindia.co.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications