రూ.1,40,000 జీతంతో హైదరాబాద్ లో ఉద్యోగాలు.. DON'T MISS
నిరుద్యోగ యువతకు శుభవార్త. మీకోసమే రూ.1,40,000 జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ సంస్థలో ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) పోస్టులలో అవకాశం కల్పిస్తుంది. ఆసక్, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మే 16 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు..
80
ఏ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే..?
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఈసీఈ
ఇన్‌స్ట్రుమెంటేషన్
కంప్యూటర్ సైన్స్ / ఐటీ
మెకానికల్
ఎలక్ట్రికల్ / ఈఈఈ
సివిల్
కెమికల్

అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత తప్పనిసరి.
అభ్యర్థి వయస్సు 2025 ఏప్రిల్ 30 నాటికి గరిష్ఠంగా 27 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపులు..
ఓబీసీ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాలు
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ సమయంలో నెలకు రూ. 40,000.. ఆ తర్వాత జీతం గరిష్ఠంగా రూ. 1,40,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
దరఖాస్తుకు గడువు..
2025 మే 16 నుంచి 2025 జూన్ 5 వరకు
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ఎగ్జామ్ సెంటర్స్..
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా
దరఖాస్తు ఫీజు..
సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 1000
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు: ఫీజు లేదు
ఇది బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారికి నిజంగా ఇది సువర్ణావకాశం అని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలో పేరు గాంచిన సంస్థలో పని చేయాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.












Click it and Unblock the Notifications