JObs: మీరు గ్రాడ్యుయేటా.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఏడాదికి రూ.4.5 లక్షలు జీతం..!

మీరు హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇటీవల 0-2 సంవత్సరాల సంబంధిత అమ్మకాల అనుభవంతో గ్రాడ్యుయేట్‌లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఎనలిటికల్, సేల్స్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తుదారులు అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలతో పాటు స్థానిక భాష ప్రాంతంపై బలమైన అవగాహన కలిగి ఉండాలని బ్యాంకు పేర్కొంది.

బ్యాంకింగ్, సేల్స్ లేదా కలెక్షన్‌లో 1-2 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులకు బ్యాంక్ ప్రాధాన్యత ఉంటుంది. హైదరాబాద్‌లోని వివిధ బ్యాంకు శాఖల్లో మొత్తం 20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు అవసరాలు, వారి నైపుణ్యాన్ని బట్టి సికింద్రాబాద్ లేదా హైదరాబాద్‌లో పని చేసే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు గరిష్ఠంగా వార్షిక వేతనం రూ. 4.5 లక్షలు అందుకుంటారు.

Jobs will be filled in Ujjeevan Small Finance Bank

పైన పేర్కొన్న అర్హతలను కలిగి ఉన్నవారు, ఈ అవకాశం గురించి ఉత్సాహంగా ఉన్నవారు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి మెయిల్ ఐడీకి మీ సీవీ పంపవచ్చు. మీరు సీవీ పంపించాల్సిన మెయిల్ ఐడీ: [email protected]. ఈ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం కోసం 9959199522 కూడా ఫోన్ చేయవచ్చు.

హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) కూడా జాబ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలను కల్పించనున్నారు. ఎంపికైనవారు హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు మే 24 నుంచి జూన్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+