బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్.. నో ఎగ్జామ్.. ఆన్ లైన్ ఇంటర్వ్యూతో జాబ్..
నిరుద్యోగులకు బంపర్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ అయిన కర్ణాటక బ్యాంక్ కు చెందిన తెలంగాణ, ఏపీలోని బ్రాంచీల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లోని 75 ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ స్టార్ట్ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 25లోపు అప్లికేషన్ పూర్తి చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
కర్ణాటక బ్యాంకు సంబంధించి ఏపీ, తెలంగాణలోని బ్రాంచీల్లో ఉద్యోగాలకు మార్చి 20న నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్స్ కు చివరి తేదీ మార్చి 25 వరకు ఉంది.
మొత్తం పోస్టులు: 75 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ స్కేల్-1 కేడర్( ఛార్టెడ్ ఎకౌంటెంట్ 25, లా ఆఫీసర్ 10, స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎంబీఏ) 10, ఐటీ స్పెషలిస్ట్ 30
అర్హత: ఛార్టెడ్ ఎకౌంటెంట్ పోస్టులకు సీఏ ఫైనల్ పరీక్ష పాసై ఉండాలి. 2024 లేదా 2025లో ఫస్ట్ 3 ప్రయత్నాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లా ఆఫీసర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీ నుంచి ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసి ఉండాలి. 2024 లేదా 2025లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2024 లేదా 2025లో 70శాతం ఉత్తీర్ణతతో పాసై ఉండాలి. ఇక ఐటీ స్పెషలిస్ట్ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ఐటీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ చేసి ఉండాలి. 2024 లేదా 2025లో 70 శాతం ఉత్తీర్ణతతో పాసై ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 20, 2025
అప్లికేషన్ చివరి తేదీ: మార్చి 25, 2025
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థుల విద్యార్హత, మార్కులు, ఉత్తీర్ణత తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఆ అభ్యర్థులకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏప్రిల్, మే 2025 లో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత సెలక్టెడ్ అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తారు.

వేతనం: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ స్కేల్-1 ఉద్యోగుల వేతనం రూ. 48,480/- నుంచి రూ. 85, 920/- వరకు ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎలా అప్లై చేసుకోవాలి..?
కర్ణాటక బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://karnatakabank.com/ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి.. అప్లై నౌ అనే ట్యాబ్ ఓపెన్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం అందులో పొందుపరచి అప్లై చేసుకోవాలి.












Click it and Unblock the Notifications