MECON ltdలో ఉద్యోగాలు: మంచి జీతం.. ఎవరు అర్హులంటే..?
జార్ఖండ్ రాజధాని రాంచీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మీకాన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెటలర్జికల్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (మీకాన్) లిమిటెడ్ 1959లో కేంద్ర ఉక్కుశాఖ కింద ఏర్పాటు కావడం జరిగింది. ఇక మీకాన్ సంస్థ పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా జూనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ సూపరింటెండ్, అసిస్టెంట్ ఇంజినీర్, పర్సనల్ సెక్రటరీ, డిప్యూటీ ఆఫీసర్ , డిప్యూటీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మీకాన్ లిమిటెడ్ మొత్తం 19 విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ పోస్టుకు ఎలాంటి అర్హతలు ఉండాలో నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అంతేకాదు కావాల్సిన పని అనుభవం గురించి కూడా నోటిఫికేషన్‌లో వివరించింది. అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టును బట్టి కనిష్టంగా 30 ఏళ్లు గరిష్టంగా 47 ఏళ్లుగా పేర్కొంది. ఇక ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. మీకాన్ లిమిటెడ్‌లో ఆయా పోస్టులకు మంచి వేతనాలే ఇస్తోంది. ఇవన్నీ ఫిక్డ్స్ టైమ్ ఫిక్డ్స్ టెన్యూర్ పద్ధతిలో ఉంటాయి. ఆయా పోస్టును బట్టి నెలకు రూ.35,200 - రూ. 86,400/-గా ఉంది. అయితే అభ్యర్థులు అదికారిక నోటిఫికేషన్ చూసి ఆపై ఏ పోస్టుకు అర్హులవుతారో దాన్ని బట్టి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

ఇక దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లో ఎప్పుడు అప్లయ్ చేయాలనే విషయాన్ని త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో పెడుతుంది మీకాన్ లిమిటెడ్, ప్రస్తుతం నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసింది. ఇక అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500గా ఉంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు దివ్యాంగులు ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
అభ్యుర్థుల ఎంపిక పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అయితే పరీక్ష నిర్వహించాలా లేదా అనేది కంపెనీ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. ఇక షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థుల పేర్లు కంపెనీ వెబ్‌సైట్‌పై పొందుపర్చడం జరుగుతుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు మీకాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి. అంతేకాదు అభ్యర్థులు అప్లయ్ చేసే సమయంలో ఇచ్చిన మెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ తేదీ సమయం, ప్రాంతం పంపబడుతుంది. అంతేకాదు ఫైనల్ లిస్టు కూడా వెబ్‌సైట్‌పై పొందుపర్చబడుతుంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యర్థులకు కంపెనీ ట్రావెల్ అలవెన్స్‌ను రీ-ఇంబర్స్ చేస్తుంది.
అభ్యర్థులకు పోస్టింగులు ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను బట్టి ఉంటుంది. ఇక ఈ పోస్టులు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. ఒకటి లేదా రెండు లేదా మూడేళ్ల పాటు ఉంటాయి. ఇక అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.meconlimited.co.inను సందర్శించి అక్కడ Careers->careeropportunities-> click here to apply online అని ఉన్నచోట క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక ఎందుకు ఆలస్యం అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేయండి. అంతకంటే ముందు ప్రతిరోజు వెబ్‌సైట్‌ను సందర్శించండి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications