Meta: వర్క్ ఫ్రమ్ హోమ్ టూ లేఆఫ్స్..! 8 వేల ఉద్యోగులకు మెటా షాక్..!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడుతో ఉద్యోగాలు ఆవిరైపోతున్న వేళ మెటా (Meta) కూడా మరోసారి అదే బాట పట్టింది. తాజాగా అమెరికా, బ్రిటన్ సహా వివిధ దేశాల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇస్తున్నట్లు ప్రకటించిన మెటా.. అంతలోనే మనసు మార్చుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఏకంగా 8 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు (Layoffs)ఈమెయిల్ లు పంపడం ప్రారంభించింది. దీంతో వారంతా షాక్ కాక తప్పలేదు.

మెటా ప్లాట్‌ఫారమ్‌లు తమ ఉద్యోగులలో దాదాపు 10 శాతం, అంటే సుమారు 8 వేల మందికి షాకిచ్చాయి. సింగపూర్ హబ్ నుండి ఈ మేరకు మెయిల్స్ పంపారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం సింగపూర్‌లోని ప్రభావిత ఉద్యోగులకు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం 1:30 గంటలకు) మెయిల్స్ అందాయి. వివిధ దేశాల్లో సమయాల ఆధారంగా లేఆఫ్ మెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది.

Meta Called Employees Back to Office Then Laid Off 8 000 of Them at 4 AM

మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇవ్వడం, ఆపై తొలగింపులకు దిగడంతో మెటాపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియకు ముందు మెటాలో సుమారు 78వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగులు బయటకు వెళ్తున్నారు. మరికొన్ని వేల మందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నారు. ఏఐ-ఆధారిత పునర్వ్యవస్థీకరణే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతర్గతంగా ఇచ్చిన మెమోలో 7 వేల మంది ఉద్యోగులను కొత్త ఏఐ-కేంద్రీకృత బృందాలలోకి పునర్వ్యవస్థీకరిస్తామని పేర్కొన్నారు.

Meta Called Employees Back to Office Then Laid Off 8 000 of Them at 4 AM

మెటాలో తాజాగా సుమారు 6 వేల ఉద్యోగాలను రద్దు చేశారు. నిర్వాహక స్థాయిలను కూడా తగ్గించారు. దీని వల్ల ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌లు అత్యధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో మరిన్ని కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. కంపెనీలో మార్క్ జుకర్‌బర్గ్ ఏఐని తన ప్రధాన ప్రాధాన్యతగా ప్రకటించారు. మెటా ఈ ఏడాది $125-$145 బిలియన్లను ఏఐపై ఖర్చు చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలిపింది. తక్కువ మంది ఉద్యోగులు, చిన్న బృందాలు, ఏఐపై భారీ పందెం - ఇదే కంపెనీ లక్ష్యంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+