నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్: సీఏపీఎఫ్, ఈ పరీక్షలన్నీ తెలుగు సహా 13 భాషల్లో

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల నుంచి వస్తున్న విన్నపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 భాషలలో కానిస్టేబుల్ పరీక్షను నిర్వహించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్(CAPF) కానిస్టేబుల్ పరీక్షల ఎంపిక ప్రక్రియలో ప్రాంతీయ భాషలను చేర్చాలనే నిర్ణయం స్థానిక యువత భాగస్వామ్యానికి ప్రేరణనిస్తుంది.

కానిస్టేబుల్ ర్యాంక్ కోసం సీఏపీఎఫ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ భాషలలో (హిందీ, ఇంగ్లీష్ కాకుండా).. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణిలలో పరీక్ష రాసే అవకాశం కల్పించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్ష జనవరి 01, 2024 నుంచి హిందీ, ఆంగ్లంతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తారు.

 exams

సీఏపీఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ (AR), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB)తో సహా భారతదేశంలోని అనేక భద్రతా దళాలను కలిగి ఉంది. పైన పేర్కొన్న బలగాల రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు జనవరి 01, 2024 నుంచి హిందీ, ఇంగ్లీష్ కాకుండా ఏవైనా 13 ప్రాంతీయ భాషలలో పరీక్ష రాయవచ్చు.

'ఒక చారిత్రాత్మక నిర్ణయంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ.. కానిస్టేబుల్ (GD) CAPF పరీక్షలను 13 ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఇది CAPF లలో స్థానిక యువత పాల్గొనడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది' అని మంత్రిత్వశాఖ పేర్కొంది.

police

ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలంటూ ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఇతర రాష్ట్రాల నుంచి విన్నపాలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. ఈ నిర్ణయం ఎంతోమంది యువతకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+