NABARDలో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు అప్లయ్ చేసుకోండి: అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డ్). నాబార్డ్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్లు, మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి గ్రేడ్ ఏ గ్రేడ్ బి పోస్టులు. అర్హతలు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నాబార్డ్ తన ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది. నాబార్డ్‌లో మొత్తం 162 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మరియు మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.

ఇక నాబార్డ్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా పోస్టుకు తగ్గ అర్హతలు కలిగి ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రారంభ తేదీ 17 జూలై 2021 ఉండగా చివరి తేదీ 7 ఆగష్టు 2021. ఇక అప్లికేషన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా చివరి తేదీ 7 ఆగష్టు 2021. ఇక పోస్టుల పరంగా చూస్తూ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవెలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)లో 148 ఖాళీలు ఉండగా... అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రాజ్‌భాష సర్వీస్)లో 5 ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్)లో 2 ఖాళీలు, గ్రేడ్ బీ మేనేజర్ రూరల్ డెవెలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్‌లో 7 ఖాళీలున్నాయి.

NABARD Recruitment 2021:Apply for 162 Assistant Manager posts

నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఏ): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 55శాతం మార్కులతో ఉత్తీర్ణత. మేనేజర్ (గ్రేడ్ బీ) ఉద్యోగాలకు కూడా పై అర్హతలే వర్తిస్తాయి. ఇక ఎంపిక విషయానికొస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ పరీక్ష ఆపై ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హతలున్న అభ్యర్థులు అధికారిక నాబార్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.nabard.org

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+