నల్గొండ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు: ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ, రూ. లక్ష వరకు జీతం
హైదరాబాద్: నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగావకాశాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ గమనించవచ్చు.
ఖాళీలు:
మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (30), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (10) ఖాళీలు ఉన్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎంసీఐ/ఎన్‌ఎంసీ గుర్తింపు తప్పనిసరి.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతో పాటు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 44 ఏళ్లు మించకూడదు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
వాక్ ఇంటర్వ్యూలను 07-04-2022 తేదీన, గ్రీవియెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, కలెక్టర్ ఆఫీస్, నల్గొండ అడ్రస్‌లో నిర్వహించనున్నారు.
జీతం వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000,
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నెలకు రూ. 52,000 చెల్లిస్తారు.
నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications