AI డేటా సైన్స్‌తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ-పూర్తి వివరాలు..!!
ఈ పోటీ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ పొంది తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు/అభ్యర్థులకు నేషనల్ స్కిల్ అకాడెమీ ఓ సువర్ణావకాశాన్ని మీ ముందు ఉంచింది. నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా కోర్సులతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది.శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్,ఇంజినీరింగ్ ,డిగ్రీ,పీజీ,పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
దరఖాస్తుదారులు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు.సైబర్ సెక్యూరిటీ,ఏఐ, డేటా సైన్స్,బిగ్ డేటా,క్లౌడ్ కంప్యూటింగ్,ఎథికల్ హ్యాకింగ్,పైథాన్,మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి.అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్,వెబ్ డిజైన్ కోర్సులతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు ఉన్నాయి.

కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 6 నెలల వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.
ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి SC, ST, BC, EBC, OBC, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (PH), మహిళా అభ్యర్థులు,మాజీ సైనికులు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.అప్లికేషన్ సమాచారం ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications