B.Ed చేయాలనుకునే వారికి అలర్ట్, NCET అప్లికేషన్స్ ఓపెన్!

టీచింగ్‌ ఫీల్డ్‌లో కెరీర్‌ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ITEP)లో ప్రవేశాల కోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NCET 2026) నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 17 (శుక్రవారం) జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 11 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్‌ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు.

NCET 2026 Registration Open for 4-Year ITEP in IITs NITs and Central Universities Apply Before March 11

NCET 2026 : డిగ్రీతో పాటు

ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు BA-B.Ed, BSc-B.Ed, BCom-B.Ed కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. నాలుగేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో డిగ్రీతో పాటు B.Ed పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రవేశాలు పూర్తిగా పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ ద్వారా కల్పిస్తారు.

NCET 2026: దరఖాస్తు ఫీజు..

దరఖాస్తు రుసుము జనరల్‌ అభ్యర్థులకు రూ.1200, OBC (NCL)/EWS అభ్యర్థులకు రూ.1000, SC/ST/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.650గా నిర్ణయించారు. పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు అందిస్తున్న విద్యాసంస్థలు, అందుబాటులో ఉన్న సీట్లు, కోర్సుల వివరాలు వంటి పూర్తి సమాచారం అధికారిక బుక్‌లెట్‌లో లభ్యమవుతుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 నంబర్లను సంప్రదించవచ్చు లేదా [email protected] కు ఈమెయిల్‌ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+