నీట్- 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా..?

విద్యార్థులకు అలర్ట్. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష మే 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఎలాంటి అవకతవకలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరి అడ్మిట్ కార్డులు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET కు వెళ్లండి. ఆ తర్వాత హోమ్ పేజీమీద నీట్ యూజీ అడ్మిట్ కార్డు లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు నీట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. ఆ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఎడ్మిట్ కార్డును కచ్చితంగా పరీక్ష హాల్ లోకి తీసుకువెళ్లాలి. లేదంటే అనుమతి లేదు.

NEET UG 2025 Admit Card Released Step-by-Step Guide to Download

దేశవ్యాప్తంగా మే 04న యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 550 నగరాల్లో సుమారు 5 వేలకు పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కూడా ఆఫ్‌లైన్‌ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+