NEET UG : ఈ నెల 14 నుంచి నీట్ యూజీ తొలి విడ‌త కౌన్సిలింగ్‌కు ద‌ర‌ఖాస్తులు..

నీట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ‌కు అన్నీ ఏర్పాట్లు పూర్త‌య్యాయి. నీట్ యూజీ 2024 షెడ్యూల్ విడుద‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 14నుంచి తొలివిడ‌త కౌన్సిలింగ్‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ ప‌రీక్ష జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్ కూడా విడుద‌ల‌య్యింది. ఈ షెడ్యూల్‌ ప్రకారమే దేశ‌వ్యాప్తంగా తొలి విడత కౌన్సెలింగ్‌కు ఈ నెల‌ 14 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించనున్నారు. అభ్య‌ర్థులు ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించొచ్చు.

ద‌ర‌ఖాస్తుల అనంత‌రం.. ఈనెల 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థులు ఈ నెల (ఆగస్టు) 24వ తేది నుంచి 29వ తేదీల్లో క‌ళాశాలల్లో హాజ‌రు కావాల్సి ఉంటుంది. తొలివిడ‌త కౌన్సిలింగ్ పూర్త‌య్యాక రెండో విడ‌త‌ కౌన్సెలింగ్ ఉంటుంది. నీట్ యూజీ 2024 రెండో విడ‌త కౌన్సిలింగ్‌కు సెప్టెంబరు 5 నుంచి ద‌ర‌ఖాస్తులు ప్రారంభమ‌వుతాయి. ఎంపిక‌యిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను సెప్టెంబ‌ర్ 13న వెల్లడిస్తారు. అదే నెల 14 నుంచి 20వ తేదీలోపు ఎంపిక‌యిన అభ్య‌ర్థులు క‌ళాశాల‌ల్లో చేరాల్సి ఉంటుంది.

NEET UG Applications for NEET UG first phase counseling from 14th of this month

మూడో విడ‌త కౌన్సిలింగ్..

నీట్ యూజీ 2024 మూడో విడ‌త కౌన్సెలింగ్‌కు అక్టోబరు 16 నుంచి ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ ప్రారంభ‌మ‌వుతుంది. అక్టోబ‌ర్ 20 వ తేది వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపిక‌యిన వారికి అక్టోబరు 23న సీట్ల కేటాయింపు నిర్వ‌హిస్తారు. నీట్‌లో సీట్లు పొందిన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 24 నుంచి 30వ తేదీలోపు క‌ళాశాల‌ల్లో చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మూడు విడ‌త‌ల్లో నీట్‌ యూజీ కౌన్స్‌లింగ్ ఉంటుంది. అభ్య‌ర్థులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం MCC అధికారిక వెబ్‌సైట్ ను https://mcc.nic.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

కౌన్సెలింగ్‌కు అవసరమైన స‌ర్టిఫికెట్స్‌ :

నీట్‌ యూజీ 2024 ర్యాంక్‌ కార్డు, అడ్మిట్‌ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్ ఖ‌చ్చితంగా తీసుకెళ్లాలి.
8 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
టెన్త్ మార్క్క్ మెమో
6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
ఇంటర్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్‌, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌
ఆధార్ కార్డు
ఆధార్ లేనివారు పాన్ కార్డు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+