నీట్‌ యూజీ రిజల్ట్స్ రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న NEET UG 2025 ఫలితాలు విడుదలయ్యాయి. వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన ఈ జాతీయ స్థాయి పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ (National Testing Agency) అధికారికంగా ప్రకటించింది. ఈసారి మొత్తం 22 లక్షలకుపైగా అభ్యర్థులు NEET UG పరీక్ష రాశారు.

ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలి?

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in ఓపెన్ చేయండి

హోమ్‌పేజీలో కనిపించే 'NEET UG 2025 Result' లింక్‌పై క్లిక్ చేయండి

తర్వాత అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి

మీ స్కోర్‌కార్డు/ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది - డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

మరోవైపు ఈమెయిల్ ద్వారా కూడా ఫలితాలు అందుతున్నాయి

neet-ug-results-released-how-to-check

ఫైనల్ కీ లో కీలక మార్పు..

ఈసారి ఫిజిక్స్ విభాగంలో ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్లను సరైన సమాధానాలుగా ఎన్టీఏ గుర్తించింది. అందువల్ల, ఆ ప్రశ్నలో విద్యార్థులు ఎవరైతే ఆ రెండు ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకున్నారో వారికి పూర్తి మార్కులు కలిపారు. ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశం.

22 లక్షల మంది హాజరు..

మే 4న దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET UG 2025 పరీక్షకు సుమారు 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 3న ఎన్‌టీఏ ప్రాథమిక కీ (Provisional Answer Key)తోపాటు రెస్పాన్స్ షీట్లు విడుదల చేసింది. అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ 5 వరకు గడువు ఇచ్చింది. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫైనల్ కీ ప్రకారం ఫలితాలు రూపొందించారు.

చెన్నై విద్యార్థుల పిటిషన్‌ తిరస్కరణ..

మరోవైపు పరీక్ష సమయంలో చెన్నైలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా కొన్ని విద్యార్థులు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. చిన్న అడ్డంకులతో మళ్లీ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు ఎదుర్కొన్న అసౌకర్యం పట్ల ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, సమష్టిగా పరీక్షని నిలిపివేయడం సముచితం కాదని తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+