CRPF Jobs : సీఆర్పీఎఫ్‌లో ఆ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు...
దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ ఫోర్స్‌గా ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సర్వీస్(CRPF)లో ఆపరేషన్స్ యూనిట్లకు యువ ఆఫీసర్ల కొరత నెలకొంది. యాంటీ టెర్రర్,యాంటీ నక్సలైట్ ఆపరేషన్లకు యువ ఆఫీసర్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రతీ 6-8 నెలలకు ఒకసారి వయోపరిమితిని పెంచుతూ వస్తున్నారు. గడిచిన రెండేళ్లలో కోబ్రా యూనిట్‌లో ఉద్యోగాల భర్తీకి మూడుసార్లు వయోపరిమితిని పెంచారు. కోబ్రా యూనిట్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయోపరిమితిపై సోమవారం(సెప్టెంబర్ 27) కొత్త ఆదేశాలు వెలువడ్డాయి.
వయోపరిమితి పెంపుపై సీఆర్పీఎఫ్ అధికారులు మాట్లాడుతూ... 2019కి ముందు కోబ్రా యూనిట్‌లో అసిస్టెంట్ కమాండర్ స్థాయి అధికారికి గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లుగా ఉండేదన్నారు. తాజా ఆదేశాలతో గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లకు సడలించినట్లు చెప్పారు. డిప్యూటీ కమాండర్ స్థాయికి గరిష్ఠ వయోపరిమితిని 38 ఏళ్ల నుంచి 43 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు.

కోబ్రా అధికారి ఒకరు మాట్లాడుతూ...'48 ఏళ్ల వయసులో ఒక కమాండెంట్ కోబ్రా యూనిట్‌లో చేరితే... 25 ఏళ్ల జవానుతో అతను ఎలా కలిసిపోగలడు.కోబ్రా యూనిట్‌లో కమాండెంట్ గరిష్ఠ వయోపరిమితిని 48 ఏళ్లకు పెంచారు. 50 ఏళ్లు లేదా ఆపై వారు యూనిట్‌లో కొనసాగుతారు.' అని తెలిపారు.
సీఆర్పీఎఫ్‌లో సకాలంలో ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా వయోపరిమితి పెంపుకు కారణంగా చెబుతున్నారు.'నేను సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నాను.కానీ నాతో పాటు ఇతర పారామిలటరీ ఫోర్స్‌లలో చేరినవారు డిప్యూటీ కమాండెంట్స్ హోదాలో ఉన్నారు.కాబట్టి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వకపోతే... ఆపరేషన్ యూనిట్లను లీడ్ చేసే యువ ఆఫీసర్లను ఎప్పటికీ పొందలేరు.' అని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌లో ఎక్కువమంది అధికారులు 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారే. 45ఏళ్ల లోపు అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు.'ఆపరేషన్స్‌లో పాల్గొన్నప్పుడు చాలా దూరం నడవడం,పరిగెత్తడం,జంప్ చేయడం,చెట్లు,గుట్టలు ఎక్కడం,ఒకేచోట ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం... ఇలా చాలా యాక్టివిటీస్ ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వయసు చాలా కీలకం.' అని కోబ్రా అధికారి ఒకరు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications