NIFTలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..అర్హతలు ఇవే..!!
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ (అకౌంట్స్/ అడ్మిన్), మెకానిక్, స్టెనో గ్రేడ్-III, నర్సు, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ , లాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలన్నీ కాంట్రాక్ట్ ఆధారిత పోస్టులని నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది.
ఇక పోస్టుల ఖాళీల వివరాలకు వస్తే అసిస్టెంట్ (అకౌంట్స్)లో 3 పోస్టులు, అసిస్టెంట్ (అడ్మిన్)-1, మెషీన్ మెకానిక్ -1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -III -1 పోస్టు, నర్సు 8 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 1 పోస్టు, లైబ్రరీ అసిస్టెంట్ 8 పోస్టులు,లాబ్ అసిస్టెంట్ 8 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హతలు ఆయా పోస్టులను బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ఏ పోస్టుకు ఎలాంటి విద్యార్హతలు ఉండాలో తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.

అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 27 ఏళ్లు ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ఇక ఎంపిక విషయానికొస్తే.. అభ్యర్థులకు రాతపరీక్ష స్కిల్ టెస్టులు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.295/- చెల్లించాలి. అయితే ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఇక దరఖాస్తులు అందాల్సిన చివరి తేదీ 18 అక్టోబర్ 2021.ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు కూడా బాగానే చెల్లించనున్నారు. వేతనంకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nift.ac.in/gandhinagar ను సందర్శించి అక్కడ పొందుపర్చిన నోటిఫికేషన్‌ను చూడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications