నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!!
నార్త్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1664 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 సెప్టెంబర్ 2021.
సంస్థ పేరు: నార్త్ సెంట్రల్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1664
జాబ్ లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 1 సెప్టెంబర్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
వయస్సు: అభ్యర్థుల కనీస వయస్సు 15ఏళ్లు గరిష్ట వయస్సు 28 ఏళ్లు. ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
అప్లికేషన్ ఫీజు: జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫీజు వివరాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను అభ్యర్థులు చూడాలి.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 2 ఆగష్టు 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 సెప్టెంబర్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://ncr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications