తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో 1,616 పోస్టులు, ఆర్టీసీ ఆస్పత్రుల్లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు వివరాలు..
- ఈ భర్తీ ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 8 నుండి 22 వరకు జరగనుంది.
- ప్రతి అభ్యర్థి ఒక్కో పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే వేరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
- అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీ లో అనుభవం మరియు సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
- దరఖాస్తు పూర్తి చేయడానికి అధికారిక వెబ్‌సైట్ లో గైడ్‌లైన్‌లు పాటించాలి.
- దరఖాస్తుల సమీక్ష తరువాత మాత్రమే ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ భర్తీ పూర్తయితే, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ సంఖ్య పెరుగుతుందని.. తద్వారా జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయని ఆశాభావం వ్యక్తం అవుతోంది.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 8,000 పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఇంకా 7,000 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో హెల్త్ సర్వీసెస్ మరింత సమర్థవంతంగా మారుతాయని వెల్లడించారు.

More From
-
నెలకు రూ.69,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! -
తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే! -
ఇల్లు కట్టే వారికి బంపర్ ఆఫర్: కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే.. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications