ఇన్సూరెన్స్‌ కంపెనీలో 300 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.

నిరుదోగ్యుల‌కు గుడ్‌న్యూస్‌.. యూఐఐసీ ఇన్సూరెన్స్‌ సంస్థ 300 అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) డిగ్రీ అర్హ‌తతో ఓ జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభమవుతుంది. అర్హ‌త అస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర్ర‌క్రియ డిసెంబ‌ర్ 16 నుంచి ప్రారంభ‌మ‌య్యి జ‌న‌వ‌రి 6, 2024 వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. డిగ్రీ పూర్తిచేసిన‌వారంతా ఈ ఉద్యోగాల‌కు అర్హులే. కాబ‌ట్టి ద‌రఖాస్తు చేసుకోండి. ఈ ప‌రీక్ష ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ఆన్‌లైన్ ప‌రీక్ష‌, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

వివ‌రాలు..

అసిస్టెంట్: 300 పోస్టులు (ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 పోసులు ఖాళీగా ఉన్నాయి)
విద్యార్హ‌త : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వ‌య‌స్సు : 30-00-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత‌భ‌త్యాలు : రూ.22,405 - రూ.62,265 ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.
అప్ల‌య్ చేసుకునేందుకు ఫీజు : జ‌న‌ర‌ల్, ఓబిసి అభ్య‌ర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి.

Notification for 300 jobs in insurance company...

ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ముఖ్య తేదీలు :

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: డిసెంబర్‌ 16, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 06, 2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 06, 2024.

పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి
https://uiic.co.in/recruitment/details/15257

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+