రైల్వేలో 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలివే!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు ఓ శుభవార్తను మోసుకొచ్చింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే రైల్వేలో నోటిఫికేషన్ విడుదల చేసింది. బిలాస్‌పుర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీని పూర్తిచేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ సీట్లకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే అకడమిక్, టెక్నికల్లో సాధించిన ఉత్తీర్ణతా కారణంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. పదోతరగతి, ఇంటర్, తదితర ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
మొత్తం ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ట్రెడ్ అప్రెంటిస్‌షిప్: 733 ఖాళీలు
వయోపరిమితి: ఏప్రిల్ 12 వరకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ వర్తించేవారికి మూడు నుంచి పది సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

ట్రేడులు: కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ (మెకానికల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానికల్ (ఆర్‌ఏసీ), ఎస్‌ఎండబ్ల్యూ, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), డిజిల్ మెకానిక్, టర్నర్, వెల్డర్, వైర్‌మెన్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత : పదోతరగతి, ఇంటర్ కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత ఉన్నవారు అర్హులు. దీంతోపాటు తదితర ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత కూడా ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపిక విధానం: టెన్త్, ఇంటర్ మార్కుల మెరిట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024.












Click it and Unblock the Notifications