విద్యార్ధులకు గోల్డెన్ ఛాన్స్.. సైబర్‌ సెక్యురిటీలో ఫ్రీ టైనింగ్‌ !!

ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ వందలాది మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా స్కామ్‌లు, ఫేక్ లింకులు, ఫిషింగ్ ఇమెయిల్స్ వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే పౌరులను సైబర్ బెదిరింపుల నుంచి రక్షించడం, అవగాహన కల్పించేందుకు సిద్దమైంది.

ఈ లక్ష్యంతో భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఒక ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో శిక్షణ పొందడమే కాకుండా దేశ భద్రతలో సైతం భాగస్వామ్యం అయ్యే అవకాశం పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

notification-for-free-training-in-cyber-security-for-students

ఎవరెవరు అర్హులంటే..?

  • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అలానే LLB, LLM, క్రిమినాలజీ లేదా సోషియాలజీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, డార్క్ వెబ్ డొమైన్ ఎక్స్‌పర్టైజ్, ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్, API లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్, మాల్వేర్ అనాలిసిస్-రివర్స్ ఇంజనీరింగ్ విభాగాల వారు అప్లై చేయవచ్చు.
  • కంటెంట్ క్రియేషన్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, న్యూ మీడియా, డిజిటల్ జర్నలిజంలో బీఏ లేదా ఎంఏ, డిజిటల్ మీడియా, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా వీడియో ఎడిటింగ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు, ఈవెంట్స్ లేదా పీఆర్ స్టడీస్‌లో ఎంఏ లేదా డిప్లొమా ఉన్నవారు, డేటా అనలిటిక్స్‌లో BBA లేదా MBA చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు గడువు..

ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 17, 2025 సాయంత్రం 5:30 గంటల వరకు గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ..

  • ముందుగా I4C అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ఉన్న "What's New" విభాగంపై క్లిక్ చేయాలి.
  • అక్కడ ఇవ్వబడిన ఇంటర్న్‌షిప్ వివరాలను చదివి, అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అర్హత ప్రమాణాలు, నియమాలు చదివిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://cybercrime.gov.in/ సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+