ఏపీ భవిత కేంద్రాల్లో 396 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ(పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్‌పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాదిపాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
మొత్తం 396 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బీ శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించరు. దరఖాస్తు రుసుం రూ. 100. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 18-42 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు.
జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.
ఏపీలో 597 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రూప్-1లో 89 పోస్టులు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి గత సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది.
597 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, గ్రూప్-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరి-II, అసిస్టెంట్ కమిషనర్(ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఇక, గ్రూప్-2 కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్లు(గ్రేడ్-II), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ IIతోపాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో త్వరలోనే కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏయే విభాగాల్లో ఏయే పోస్టులను భర్తీ చేయనుందో వెల్లడించారు.












Click it and Unblock the Notifications