తెలంగాణలో ఆరోగ్యశాఖలో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఈ మేరకు మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో 2050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులకు అక్టోబర్ 14 తుది గడువు. నవంబర్ 17న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రూప్ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్
తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయని ఇప్పటికే వెల్లడించగా.. ఈమేరకు తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మోడల్ ఆన్సర్ బుక్లెట్లను వెబ్సైట్లో ఉంచినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.
మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రూప్ 3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదటగా 2022 డిసెంబర్ 30న 1363 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత 13 పోస్టులు చేర్చారు. బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులకు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది. అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి.. వాటిని కూడా కలిపింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 1388కి పెరిగింది.












Click it and Unblock the Notifications