NPCILలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి..జీతం ఎంతంటే..?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు మంచి వార్త చెప్పింది. ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌గా చేరాలనుకుంటే అలాంటి వారికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవే...

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 107 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే ఫిట్టర్ విభాగంలో 30 పోస్టులు ఉండగా, టర్నర్ విభాగంలో నాలుగు పోస్టులు, మెకానిస్ట్ విభాగంలో నాలుగు పోస్టులు, ఎలక్ట్రీషియన్ విభాగంలో 30 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో 30 పోస్టులు, వెల్డర్ విభాగంలో నాలుగు పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఐదు పోస్టులు భర్తీచేయనుంది.

NPCIL had issued a notification to fill 107 Apprentice posts.

విద్యార్హతల విషయానికొస్తే ఆయా విభాగంకు సంబంధించి అభ్యర్థులు ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఉదాహరణకు అభ్యర్థి ఫిట్టర్‌కు అప్లయ్ చేస్తున్నట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిట్టర్ విభాగంలో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల విషయానికొస్తే అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల కంటే తక్కువగా ఉండరాదు అదే సమయంలో 24 ఏళ్లకు మించి ఉండరాదు. 13 సెప్టెంబర్ 2021 నాటికి అభ్యర్థి వయస్సు 14 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ పేర్కొంది. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐఎల్ స్పష్టం చేసింది. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్లు 25 ఆగష్టు 2021 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు అందేందుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2021.

ఎంపికైన అభ్యర్థుల రెండేళ్ల ఐటీఐ డిప్లొమా చేసివారికి నెలకు రూ.8855 వేతనంగా చెల్లిస్తారు. ఇక ఒక ఏడాది ఐటీఐ డిప్లొమా చేసిన వారికి రూ.7700 నెలకు వేతనంగా చెల్లిస్తారు. ఇక పూర్తి వివరాలకు అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. https://npcilcareers.co.in/MainSite/default.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+