NPCIL Jobs:10 పాసై ఐటీఐ సర్టిఫికేట్ ఉందా.. అయితే మంచి జీతంతో ఉద్యోగం..!!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌)లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 173 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 16 ఆగష్టు 2021.అయితే ఈ పోస్టులకు స్టయిపెండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

ఇక పోస్టుల విషయానికొస్తే ఫిట్టర్ ఉద్యోగాలు 50 ఉండగా.. మెకానిస్ట్ 25 పోస్టులు వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్) 8 పోస్టులు ఎలక్ట్రీషియన్ 40 పోస్టులు, ఎలక్ట్రానికి మెకానిక్ 20 పోస్టులు, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ పోస్టులు 5, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్ పోస్టులు 20, మెకానికి ఇండస్ట్రియల్ ఎయిర్ కండీషనింగ్ పోస్టులు 5 ఉన్నాయి. మొత్తం 173 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NPCIL Recruitment 2021:Apply for 173 trade Apprentice jobs

అర్హతల విషయానికొస్తే ఫిట్టర్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

మెకానిస్ట్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటుమెకానిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

వెల్డర్: 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి

ఎలక్ట్రీషియన్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

ఎలక్ట్రానిక్ మెకానిక్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు రేడియో మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు రేడియో మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

మెకానిక్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండీషనింగ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుగా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

అర్హులైన అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఐటీఐ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ పోస్టింగులన్నీ తమిళనాడులోని కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులో ఉంటాయి. ఒక ఏడాది పాటు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.

మరిని వివరాలకు: https://www.npcil.nic.in/content/289_1_Opportunities.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+