ఎన్టీపీసీ ఎన్జీఈఎల్ దిమ్మతిరిగే ఆఫర్.. 11 లక్షల జీతంతో ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఎన్టీపీసీ ఎన్జీఈఎల్ దిమ్మతిరిగే ఆఫర్ ప్రకటించింది. ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఢిల్లీలో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఐటీ విభాగాల్లో బీటెక్, బీఈ పాసైన అభ్యర్థులు అలాగే ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు. ఈ ఉద్యోగాలకు 11 లక్షల జీతం అందించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు..

182

ఖాళీల వారీగా పోస్టుల వివరాలు..

ఇంజినీర్‌ ( ఆర్‌ఈ-సివిల్‌ ) - 40

ఇంజినీర్‌ ( ఆర్‌ఈ-ఎలక్ట్రికల్ ) - 80

ఇంజినీర్‌ ( ఆర్‌ఈ- మెకానికల్ ) - 15

ఎగ్జిక్యూటివ్‌ ( ఆర్‌ఈ- హ్యూమన్‌ రీసోర్స్‌ ) - 07

ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ -ఫైనాన్స్‌ ) - 26

ఇంజినీర్‌ ( ఆర్‌ఈ-ఐటీ ) - 04

ఇంజినీర్‌ ( ఆర్‌ఈ-కాంట్రాక్ట్‌ మెటీరియల్‌ ) - 10

ntpc-ngels-tempting-offer-jobs-with-a-salary-of-11-lakhs

విద్యార్హత..

బీఈ, బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ పాసై ఉండాలి. అలాగే గత అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు..

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే 30 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ..

ఆన్ లైన్

ఎంపిక విధానం..

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ

జీతం..

ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.11లక్షల వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - రూ.500

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు

దరఖాస్తుకు చివరి తేది..

2025 మే 1

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను https://ngel.in/career చూడొచ్చు. అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భారీ వేతనం ఆఫర్ చేస్తుండడం బాగా కలిసొచ్చే అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+