NTPC Recruitment: మైనింగ్ పోస్టుల కోసం అప్లై చేయండి, జీతం రూ. 50 వేల వరకు
న్యూఢిల్లీ: మైనింగ్ సర్దార్, మైనింగ్ ఓవర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక NTPC వెబ్‌సైట్ ntpc.co.inను సందర్శించవచ్చు.
పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు మార్చి 15, 2022. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 177 ఖాళీలను భర్తీ చేస్తుంది. అభ్యర్థులను మూడేళ్లపాటు నిర్ణీత కాలవ్యవధిలో నియమించుకుంటారు.
NTPC రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
మైనింగ్ ఓవర్‌మ్యాన్ 74 పోస్టులు

మైనింగ్ సిర్దార్ 103 పోస్టులు
NTPC రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష రాంచీ, రాయ్‌పూర్, భువనేశ్వర్‌లలో నిర్వహించబడుతుంది.
NTPC రిక్రూట్‌మెంట్ 2022: విద్యార్హత
మైనింగ్ ఓవర్‌మ్యాన్ పోస్ట్: అభ్యర్థులు బొగ్గు కోసం DGMS జారీ చేసిన CMR కింద ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్‌తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
మైనింగ్ సిర్దార్ పోస్ట్: అభ్యర్థులు బొగ్గు కోసం DGMS జారీ చేసిన సిర్దార్ సర్టిఫికేట్, సెయింట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ జారీ చేసిన ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
NTPC రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 57 సంవత్సరాలు.
NTPC రిక్రూట్‌మెంట్ 2022: జీతం వివరాలు
మైనింగ్ ఓవర్‌మ్యాన్: నెలకు రూ. 50,000
మైనింగ్ సర్దార్: నెలకు రూ. 40,000












Click it and Unblock the Notifications