NTPC Recruitment: ఎన్టీపీసీలో 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, భారీగా వేతనం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ థర్మల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్లి కలిగిన, అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 495 పోస్టులు. వీటిలో విభాగాల వారీగా..
ఎలక్ట్రికల్: 120
మెకానికల్: 200
ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్: 80
సివిల్: 30
మైనింగ్: 65 పోస్టులు ఉన్నాయి.

NTPC Recruitment 2023: Apply for 495 Engineering Executive Trainees

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంది.

విద్యార్హత:
అభ్యర్థుల కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బీటెక్(ఇంజినీరింగ్/టెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్-2023) పరీక్ష రాసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
గేట్-2023లో సాధించిన స్కోరు, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు, తదితరాల ఆధారంగా.

వేతనం:
ఎంపికైన వారికి రూ. 40,000- రూ. 1,40,000 వేతనంతోపాటు ఇతర సదుపాయాలు ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులు వేర్వేరు చోట్ల ఏడాదిపాటు శిక్షన తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక పోస్టింగ్ ఇస్తారు. దేశంలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

జనరల్/ EWS/ OBC వర్గానికి చెందిన అభ్యర్థులు రూ. 300/- రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . SC/ST/PwBD/XSM వర్గం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయించబడ్డారు. చెల్లింపును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో చేయవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు NTPC లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://careers.ntpc.co.in/recruitment/advertisements/_eng_adv

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+