ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు..ఇలా అప్లై చేసుకోండి..
హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొ. జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో అప్లికేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 72 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. అర్హులైన అభ్యర్థలు మార్చి 31 తేదీ లోపు అప్లై చేసుకోవాలని వివరించింది. పూర్తి వివరాలకు ఈ నంబర్లకు 8886111690, 040-27097177, 040-27098350 సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. అభ్యర్థులు www.oucde.net వెబ్ సైట్ లోకి వెళ్లి కోర్సుల వివరాలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు..
అర్హులైన అభ్యర్థులు www.oucde.net అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. డిగ్రీ,పీజీ, డిప్లోమా కోర్సులు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ నెం, ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కోర్సు అప్లై చేసుకుని ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును సెమిస్టర్ల వారీగా పే చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
కోర్సుల వ్యవధి ఆయా కోర్సులు బట్టి ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. కొన్ని కోర్సులు తెలుగులో మరికొన్ని కోర్సులు ఇంగ్లీష్ లో ఉంటాయి. సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి. దరఖాస్తు పూర్తిగా ఆన్ లైన్ లో చేసుకోవాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications