Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు! రైల్వేలో 5,349 ఉద్యోగాలు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు వెస్ట్రన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. Western Railway పరిధిలో మొత్తం 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Railway Recruitment Cell Western Railway ద్వారా దరఖాస్తు చేయాలి.

Railway Recruitment Cell Western Railway 5 349 Apprentice Vacancies Announced on Only Merit Based

కనీసం 50 శాతం మార్కులు..

అర్హతల విషయానికి వస్తే, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCVT/SCVT) కలిగి ఉండాలి. వయస్సు పరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. రిజర్వేషన్ గల వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తు ఫీజు సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.

రైల్వేలో అప్రెంటిస్ శిక్షణ పొందాలని ఆశిస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పటికీ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+