RBI Assistant Mains Result 2024 : ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ ఫ‌లితాలు విడుద‌ల..

RBI Assistant Mains Result 2024 : ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ ఫ‌లితాలు విడుద‌ల..

ఆర్‌బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ‌ల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి గ‌తేడాది డిసెంబరు 31న మెయిన్ పరీక్ష జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫలితాలను ఆర్‌బీఐ తాజాగా విడుదలచేసింది. ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్య‌ర్థులు ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rbi.org.in/ ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ మెయిన్స్ ఫ‌లితాల‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఆర్‌బీఐ విడుదల చేయ‌డం జ‌రిగింది.

దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఉన్నఅసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు గ‌త సంవ‌త్స‌రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌ 18, 19,2023 తేదీల్లో జరగ్గా, డిసెంబర్‌ 31న మెయిన్స్‌ పరీక్ష జరిగిన సంగ‌తి తెలిసిందే. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలోనే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జ‌రుగుతుంది. లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను రీజియన్లవారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆర్‌బిఐ అసిస్టెంట్ ఉద్యోగాల‌కు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జ‌రుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 జీతం ఉంటుంది.

RBI Assistant Mains Result 2024 RBI Assistant Mains Result Released

అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం కింద ఉన్న‌ లింక్‌ను క్లిక్ చేయండి..

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/Assistant_2023_Result06032024.pdf

అసిస్టెంట్ పోస్టుల సంఖ్య : 450

అహ్మదాబాద్- 13 పోస్టులు
బెంగళూరు- 58 పోస్టులు
భోపాల్- 12 పోస్టులు
భువనేశ్వర్- 19 పోస్టులు
చండీగఢ్- 21 పోస్టులు
చెన్నై- 1 పోస్టులు
గువాహటి- 26 పోస్టులు
హైదరాబాద్- 14 పోస్టులు
జైపుర్- 5 పోస్టులు
జమ్మూ- 18 పోస్టులు
కాన్పుర్, లఖ్‌నవూ- 55 పోస్టులు
కోల్‌కతా- 22 పోస్టులు
ముంబయి- 101 పోస్టులు
నాగ్‌పుర్ - 19 పోస్టులు
న్యూదిల్లీ - 28 పోస్టులు
పట్నా - 1 పోస్టులు
తిరువనంతపురం, కొచ్చి - 16 పోస్టులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+