RBI Recruitment: పలు కీలక పోస్టుల భర్తీ, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ (RBISB) ఆర్కిటెక్ట్, క్యూరేటర్, ఇతర పోస్టుల కోసం అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాంకింగ్ రంగంలో చేరాలనుకునే అభ్యర్థులకు ఇది బంగారు ఉద్యోగ అవకాశంగా చెప్పవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్ మొత్తం 3 పోస్టులను భర్తీ చేయాలని చూస్తోంది. ఉద్యోగ వార్తలలో ప్రచురించబడిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. గ్రేడ్ Aలో అగ్నిమాపక అధికారికి ఆన్‌లైన్ పరీక్ష జూలై 9, 2022న నిర్వహించబడుతుంది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 23, 2022 నుంచి RBI అధికారిక వెబ్‌సైట్, rbi.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 13, 2022 అని అభ్యర్థులు గమనించాలి.
RBI రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 23
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు: జూన్ 13
RBI రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు
క్యూరేటర్: 1 పోస్ట్
ఆర్కిటెక్ట్: 1 పోస్ట్
ఫైర్ ఆఫీసర్: 1 పోస్ట్
RBI రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా మే 23, 2022 నుండి RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.inని సందర్శించాలి.
RBI రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 2 గంటల పాటు నిర్వహించబడుతుంది. 35 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-
టెన్త్ క్లాస్ అర్హత తోనే ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతంతో !! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications