RRB Jobs : ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి భారీ రిక్రూట్‌మెంట్.. రేపటి నుండే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
రైల్వే ఉద్యోగాల కోసం కలలు కనే యువతకు మరో మంచి అవకాశం లభించనుంది. రైల్వే ఎన్‌టిపిసీలో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడుయేట్ స్థాయిలో ఆర్ఆర్‌బీ 11,558 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్ఆర్‌బి గ్రాడ్యుయేట్ లెవల్ ఎన్‌టిపిసిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటి (సెప్టెంబర్ 14) నుండి ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపటినుండి దరఖాస్తు చేసుకోగలరు. అప్లయ్ చేసుకోవాలనుకున్నవారు RRB అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inని సందర్శించగలరు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13,2024 తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
విద్యార్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్‌లో నైపుణ్యం, టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

వయసు..
ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయాలనుకునే వారి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు..
ఫీజు వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్/OBC/EWS అభ్యర్థులకు: 500/- దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, SC/ST/PH లకు: 250/ చెల్లించాలి. స్త్రీలయితే రూ. 250/- చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఫీజు మోడ్ ద్వారా మాత్రమే చెల్లించగలరు.
మొత్తం పోస్టులు: 11,558
పోస్టుల వివరాలు..
అండర్ గ్రాడ్యుయేట్ : మొత్తం 3445 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 990
అకౌంట్స్ క్లర్క్ (కమ్ టైపిస్ట్) - 361
ట్రైన్ క్లర్క్ - 72
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2022
గ్రాడ్యుయేట్: మొత్తం 8113 పోస్టులు
గూడ్స్ ట్రైన్ మేనేజర్- 3144
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్- 1736
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 732
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- 1507
స్టేషన్ మాస్టర్- 994
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications