RRB Recrutiment 2021 : రైల్వేలో 3093 అప్రెంటిస్ పోస్టులు... పూర్తి వివరాలివే...

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) నుంచి మరో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్,నార్తర్న్ రైల్వే పరిధిలో 3092 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి... అధికారిక(http://www.rrcnr.org/)వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ప్రచురించారు. సెప్టెంబర్ 20న ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా... తుది గడువు అక్టోబర్ 30 వరకు ఉంది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) పరిధిలోనూ 432 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.నోటిఫికేషన్‌ను (secr.indianrailways.gov.in)వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.ఈ పోస్టులకు అక్టోబర్ 10న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

rrb recruitment 2021 notification for apprentice posts in railway

విద్యార్హత :

ఆసక్తిగల విద్యార్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షతో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ITI)లో సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

SECR అప్రెంటిస్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి :

Step 1 : apprenticeshipindia.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Step 2 : హోంపేజీలో SECR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి.

Step 3 : సంబంధిత వివరాలన్నీ ఎంటర్ చేసి... అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Step 4 : రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ,పాస్‌వర్డ్‌తో అప్లికేషన్ ఓపెన్ చేసి వివరాలు నింపాలి.

Step 5 : సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.భవిష్యత్‌లో రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ :

మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులో కొనసాగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+