నిరుద్యోగులకు ఆర్ఆర్‌బీ బంపర్ ఆఫర్.. 6374 పోస్టులు !
రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ స్థాయిలో టెక్నీషియన్ పోస్టులకు నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలో మొత్తం 6,374 టెక్నీషియన్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ I (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ III విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28, 2025 నుంచి ప్రారంభమవుతుందని, జూలై 28, 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు - 6,374 పోస్టులు
రైల్వే జోన్ల వారీగా ఖాళీలు..
తూర్పు రైల్వే (ER) - 1,119
వెస్ట్రన్ రైల్వే (WR) - 849
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) - 404
ఉత్తర రైల్వే (NR) - 478
నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) - 241
సెంట్రల్ రైల్వే (CR) - 305
ఇతర జోన్లు కలిపి - 2,978
అర్హతలు..
టెక్నీషియన్ గ్రేడ్ I (సిగ్నల్) - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్) లేదా సంబంధిత విభాగంలో టెక్నికల్ డిప్లొమా.
టెక్నీషియన్ గ్రేడ్ III - 10వ తరగతి ఉత్తీర్ణత, మరియు సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT లేదా SCVT) సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి (01-07-2025 నాటికి)..
గ్రేడ్ I - 18 సంవత్సరాలు నుంచి 36 సంవత్సరాలు
గ్రేడ్ III - 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు
వయో సడలింపు..
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
ఓబీసీ : 3 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాలు
జీతం..
గ్రేడ్ I ₹29,200 - ₹92,300
గ్రేడ్ III ₹19,900 - ₹63,200
ఇవే కాకుండా DA, HRA, ఇతర భత్యాలు చేర్చబడతాయి.
దరఖాస్తు రుసుము..
జనరల్ / ఓబీసీ / EWS - రూ. 500
ఎస్సీ / ఎస్టీ / మహిళలు / దివ్యాంగులు - రూ.250. అయితే దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల 10 జూన్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 28 జూన్ 2025
దరఖాస్తు ముగింపు 28 జూలై 2025 (రాత్రి 11:59 వరకు)
CBT పరీక్షలు సెప్టెంబర్ - అక్టోబర్ 2025 (అంచనా)
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in ను సందర్శించవచ్చు. అంతే కాకుండా అభ్యర్థులు నకిలీ వెబ్‌సైట్‌లు, తప్పుడు సమాచారం నుంచి జాగ్రత్తగా ఉండాలి.
అప్లికేషన్ సమర్పణ తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం మర్చిపోకండి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications