SBI Apprentice Recruitment: 6వేలకుపైగా పోస్టుల కోసం అప్లై చేయండి
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1, 2023న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 6160 పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా చేయవచ్చు. అభ్యర్థులు ఒక రాష్ట్రంలో మాత్రమే ఎంగేజ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంగేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కింద అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే పరీక్షకు హాజరుకాగలరు. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2023
రాత పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2023
అర్హత ప్రమాణం:
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఉంటాయి. వ్రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి, గరిష్ట మార్కులు 100. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా, వ్రాత పరీక్ష కోసం పరీక్ష ప్రశ్నలు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తారు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషలలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్/ OBC/ EWS కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 300/-. SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.inని తనిఖీ చేయవచ్చు.
SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications