SBIలో 2056 పీఓ ఉద్యోగాలు: బ్యాక్‌లాగ్ పోస్టులు ఎన్ని.. అర్హతలు ఏంటి..?

బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ ‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయడం జరుగుతుంది.

ఇక వేతనం విషయానికొస్తే సాధారణంగా బ్యాంకులు మంచి వేతనాలు చెల్లిస్తాయి. ఇక ప్రత్యేకించి ప్రొబేషనరీ పోస్టుల వేతనాలు ఇలా ఉన్నాయి. నెలకు రూ.41,960 (4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్) తో ఉంటుంది. పేస్కేల్ ఇలాగుంది. రూ. 36000 - 1490/7 - 46430 - 1740/2 - 49910 - 1990/7-63840.బేసిక్ పే కాకుండా ఇతర అలవెన్సులు అంటే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), హెచ్‌ఆర్ఏ,లీజు రెంటల్,సీసీఏ,మెడికల్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

SBI Recruitment 2021:Apply for 2056 PO posts

జనరల్ కేటగిరీ కింద 810 పోస్టులు, ఈడబ్లుఎస్ పోస్టులు 200, ఓబీసీ పోస్టులు 560,ఎస్టీ పోస్టులు 162, ఎస్సీ 324 పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికొస్తే 2021 డిసెంబర్ 31 నాటికల్లా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. అంతేకాదు డిగ్రీ చివరి సంవత్సరంలో లేదా చివరి సెమిస్టర్‌లో ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇక వయస్సు విషయానికొస్తే 1 ఏప్రిల్ 2021 నాటికి అభ్యర్థులు కనిష్ట వయస్సు 21 ఏళ్లు గరిష్ట వయస్సు 30 ఏళ్లు ఉండాలి. అంటే అభ్యర్థి 1 ఏప్రిల్ 2000 తర్వాత జన్మించి ఉండకూడదు అదే సమయంలో 1 ఏప్రిల్ 1991 కంటే ముందు జన్మించి ఉండకూడదు. ఇక ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా ఉంటుంది. ముందుగా తొలిదశలో ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ టెస్టు, డిస్క్రిప్టివ్ టెస్టులు ఉంటాయి. ఇక మూడవ దశలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 50 మార్కుల్లో 30 మార్కులు ఇంటర్వ్యూ 20 మార్కులు గ్రూప్ డిస్కషన్స్‌కు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.750/- చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక ముఖ్యతేదీలు ఇలా ఉన్నాయి:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 5 అక్టోబర్ 2021

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25 అక్టోబర్ 2021

ప్రిలిమ్స్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్: నవంబర్ 2021 మొదటి వారం లేదా రెండో వారం

ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష: నవంబర్/డిసెంబర్ 2021

ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు : డిసెంబర్ 2021

మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్: డిసెంబర్ 2021 రెండవ వారం లేదా మూడవ వారం

మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబర్ 2021

మెయిన్స్ పరీక్ష ఫలితాలు: జనవరి 2022

ఇంటర్వ్యూకు కాల్ లెటర్: ఫిబ్రవరి 2022 మొదటి వారం లేదా రెండవ వారం

ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 2022

తుది ఫలితాలు విడుదల: ఫిబ్రవరి లేదా మార్చి 2022.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+